TG: కాళేశ్వరం కేసులో హైకోర్టు ప్రాథమిక ఆదేశాలు మాత్రమే ఇచ్చిందని, అసలు తీర్పు ఇంకా రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు కొల్లగొట్టారని, దోషులెవరో తమకు తెలుసని పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ విచారణను న్యాయస్థానం తప్పుపట్టలేదని, దోపిడీలో ఉన్న సూత్రధారులే కోర్టులను ఆశ్రయించారని విమర్శించారు. దోషులకు శిక్ష ఖాయమన్నారు.