ADB: వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ DCCB ఛైర్మన్ బోజా రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లావ్యాప్తంగా జొన్నల కొనుగోలు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులకు ఆదుకోవాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు బాపూరావు పేర్కొన్నారు.