పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌తో చర్చల కోసం పాక్ వెళ్లనున్న అమెరికా ప్రతినిధుల పర్యటనను ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మికంగా రద్దుచేశారు. ‘ఫలితం లేని చర్చల కోసం అంతదూరం వెళ్లి సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలు ఆగిపోగా.. ట్రంప్ తర్వాతి అడుగు ఏంటనేది చర్చనీయాంశమైంది.