AP: వివక్షకు గురవుతున్నవారికి అండగా నిలబడాలని మాటల్లో కాక చేతల్లో చూపించారు గుంటూరు పశ్చిమ MLA గల్లా మాధవి. ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించే దిశగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనకు PAగా ఓ ట్రాన్స్జెండర్ని నియమించుకున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం.. రానున్న కాలంలో ఎంతో మంది ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతుంది.