SRD: కంగ్టి మండలం నాగూర్ కే గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ధ్రువపత్రాలను మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఆలూరే మహానంద, వసుంధర సేవక్ ఆదివారం పంపిణీ చేశారు. గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు మహిళలు యువతులకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగియడంతో వారికి సర్టిఫికెట్లను అందజేసినట్లు కోఆర్డినేటర్ మహానంద తెలిపారు.