BDK: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీవో బీ.రాహుల్ వెల్లడించారు. గిరిజనులు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ దర్బార్‌కు సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.