TG: రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందనేది వాస్తవమని పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఆయిల్ కంపెనీలు సప్లయ్ తగ్గించడమే అందుకు కారణమని చెప్పింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 30 శాతం బంకుల్లో స్టాక్ లేదు. ఆయిల్ కంపెనీలు సరిపడా పెట్రోల్ సరఫరా చేయడం లేదు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆయిల్ కంపెనీల నుంచి సప్లయ్ జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని కోరింది.