TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దాదాపు 80 రోజులకు సరిపడా స్టాక్ ఉందన్నారు. భయంతో ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం వల్లే.. పెట్రోల్ కొరత ఏర్పడుతుందన్నారు. రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ధరలు పెరుగుతాయనే భయంతో కొనుగోలు చేస్తున్నారన్నారు.