ADB: పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో AHTU ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా, సోషల్ మీడియా, బాల్య వివాహాలు, సైబర్ మోసాలు, మత్తు పదార్థాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. AHTU అధికారి జోగిందర్ సింగ్ మాట్లాడుతూ.. బాల బాలికలపై లైంగిక వేధింపులు జరిగితే పోలీసులకు సమాచారం అందజేయాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంప్రదించాలని ఆయన సూచించారు.