KMR: తాడ్వాయి మండలానికి చెందిన BRS పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డి మండలం అల్మాజీపూర్ గ్రామంలో బంధువుల విందు కోసం వచ్చిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆయనను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఉన్నారు.