‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో ఫరియా అబ్దుల్లా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’లో నటించే అవకాశం వచ్చినా తాను మిస్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. అది తన కెరీర్లో చేసిన అతిపెద్ద పొరపాటని పేర్కొంది. ఆ సినిమాను వదులుకున్నాననే బాధ తన మనసులో ఎప్పటికీ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ‘గాయపడ్డ సింహం’ మే 1న విడుదల కానుంది.