JGL: మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్గా సురేష్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంతకు ముందు సీఐగా పనిచేసిన అనిల్ కుమార్ నూతన సీఐ సురేష్ బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన సీఐ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.