కోనసీమ: ఏపీఎస్ఆర్టీసీ రావులపాలెం డిపో పరిధిలోని రావులపాలెం కొత్తపేట ఆత్రేయపురం బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపులను అద్దెకు ఇచ్చుటకు టెండర్లు పిలుస్తున్నట్లు డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. టెండర్ ఫారాలు ఈరోజు నుంచి డిపో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని పూర్తి చేసిన దరఖాస్తులను రాజమండ్రి జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.