ASR: రంపచోడవరం మండలం ఊట్ల, రామన్నపాలెం పరిసర ప్రాంతంలో ఓ ఎద్దుపై పులి దాడి చేసి హతమార్చింది. చనిపోయిన ఎద్దును కొంతదూరం ఈడ్చుకెళ్లి వదిలేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.