TG: HYDలో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. అమాయకుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుడు హరీష్ సింగ్లాతో పాటు ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. నిందితుల ఖాతాల్లోని రూ.3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. లాభాల పేరుతో బురిడీ కొట్టించే ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.