KMM: ముదిగొండ మండలంలోని రైతు వేదికలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న మొదటి విడత జనగణన శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ఆదివారం హాజరైన మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) భాస్కర్ రావు శిక్షణ పూర్తి చేసుకున్న ఎన్యూమరేటర్లకు నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డులను అందజేశారు. అంకితభావంతో పనిచేయాలని అన్నారు.