బోయపాటి శ్రీను, క్లాస్ హీరో కార్తీ కాంబోలో సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి, వైవిధ్యమైన నటనతో ఆకట్టుకునే కార్తీ కోసం ఇప్పటికే ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. క్లాస్, మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న వీరిద్దరూ కలిస్తే వెండితెరపై గూస్బంప్స్ ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.