NRPT: నారాయణపేట పట్టణంలోని వృద్ధాశ్రమం, బాలసదనాన్ని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అవినాశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలు, ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అనాథ పిల్లలు, వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారిని సొంత వారిలా చూసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు.