సినీ ఇండస్ట్రీలో OTT ఇప్పుడు సేఫ్టీ నెట్ కాదు.. ఒక సవాల్‌గా మారింది. స్టార్ పవర్‌తో సంబంధం లేకుండా పెర్ఫార్మెన్స్ బేస్డ్ డీల్స్ అమల్లోకి వచ్చాయి. అంటే బాక్సాఫీస్ వసూళ్లను బట్టే OTT రేటు ఖరారవుతుంది. థియేటర్లలో ఫ్లాప్ అయితే OTT పేమెంట్‌లో కోత విధిస్తున్నారు. రిలీజ్ ఆలస్యమైనా అగ్రిమెంట్లు రద్దవుతున్నాయి. ఈ రూల్స్ నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.