తనపై వస్తున్న రూ.9.35 కోట్ల చీటింగ్ ఆరోపణలను అషురెడ్డి ఖండించింది. పెళ్లి పేరుతో తాను మోసం చేశానన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. షేక్‌పేట్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు వస్తున్న వార్తలపై ఆమె ఈ విధంగా ఘాటుగా స్పందించింది.