MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డితో కలిసి AMC చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.