NLG: ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులను ఇచ్చింది. ఈ మేరకు చిట్యాల పురపాలిక కార్యాలయంలో ఇవాళ మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్ ఆధ్వర్యంలో వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ ప్రతీకగా వాసవి మాతను కొలుస్తారన్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.