HYD: రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే రెవెన్యూ అధికారులు హైడ్రాధికారులు ఏం చేస్తున్నారని MLA కృష్ణా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు కేటాయించగా.. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు MLA దృష్టికి వెళ్లడంతో వెంటనే ప్రాంతాన్ని పరిశీలించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.