ADB: రేపు ప్రజావాణి రద్దు చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇవాళ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రెవెన్యూ, గృహ నిర్మాణ సమస్యలపై ఈనెల 27న హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రాజర్షి షా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.