MDK: రామాయంపేట మండలం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ లింబాద్రి అధ్యక్షతన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ వైశాలి పర్యవేక్షణలో దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మురికి కాలువల వద్ద చెత్త వేయరాదని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. పరిశుభ్రత పాటించి మలేరియాను తరిమికొట్టాలని వైద్యులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.