TG: శాసనమండలిలోని ఛైర్మన్ ఛాంబర్లో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. నిన్న అజారుద్దీన్, కోదండరాంను MLCలుగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆరేళ్ల పాటు వీరు MLCలుగా కొనసాగనున్నారు.