AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు సీఎం చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. విశాఖ సమీపంలోని తర్లువాడలోని 266 ఎకరాల్లో ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ రూ.1.35 లక్షల కోట్లతో వేయి మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి లోకేష్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ ప్రతినిధులు హాజరుకానున్నారు.