AP: రాష్ట్రంలో ఇంధన కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ సరఫరా జరిగేలా చూడాలని కోరారు. పెట్రోల్, డీజిల్ లేదని ‘నో స్టాక్’ బోర్డులు తగిలించడం కూటమి పాలన వైఫల్యానికి నిదర్శనమని షర్మిల విమర్శించారు.