సౌతాఫ్రికా మహిళలతో 5 T20ల సిరీస్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. 4వ T20లో ప్రత్యర్థిపై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత హర్మన్ సేన 185/5 స్కోర్ చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా 171/9కే పరిమితమైంది. మన బౌలర్లలో దీప్తి 5, క్రాంతి, శ్రీచరణి, కాశ్వీ, షఫాలీ తలో వికెట్ తీశారు. కాగా సౌతాఫ్రికా ఇప్పటికే తొలి 3 మ్యాచుల్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది.