NLG: దామరచర్ల మండలంలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కూలీలకు సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేయాలని డీఆర్డీవో శేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దామరచర్ల మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను గురువారం పరిశీలించారు. ఆయా గ్రామాలలోని నర్సరీ పనులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.