MBNR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం బహిరంగ సభలో మాత్రమే పాల్గొంటున్నారని, ఉండాల్సింది సభలలో కాదని ప్రజాక్షేత్రంలో అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందడం లేదని కేసీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.