ASF: రెబ్బెన మండలం గోలేటి పరిసరాలలో నూతన ఓపెన్ కాస్ట్ ప్రారంభానికి సహకరించాలని శనివారం కలెక్టర్ హరితను సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టు ప్లానింగ్ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా కేంద్రంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏరియాలో ప్రస్తుతం ఒక ఓపెన్ కాస్ట్ మాత్రమే నడుస్తుందని, మరో ఓపెన్ కాస్ట్ వస్తే ఏరియా మనగడ ఆశాజనకంగా ఉంటుందన్నారు.