ADB: లైసెన్సు ఉన్న దుకాణాల నుంచి రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలని DSP జీవన్ రెడ్డి శనివారం తెలియజేశారు. శనివారం బేల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని నకిలీ విత్తనాలు అమ్మే వారి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.