మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సుహాస్, సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న మూవీ మండాడి. ఈ సినిమా అంతా కూడా తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ మూవీతో సుహాస్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా వంద రోజుల్ని కేటాయించారు. వంద రోజుల కాల్ షీట్లను ఇవ్వడం చూస్తుంటే అతనికి ఈ మూవీ మీద ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.