రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ SRHతో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కేవలం 36 బంతుల్లోనే IPLలో తన రెండో సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా ప్రఫుల్ హింగే వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వరుసగా 4 సిక్సర్లు కొట్టడం గమనార్హం.