MNCL: మంచిర్యాలలో శనివారం జిల్లా రైస్ మిల్ హమాలి యూనియన్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా గుమాస ప్రకాష్, అధ్యక్ష, కార్యదర్శులుగా సురేందర్, చిన్నయ్య, కోశాధికారిగా కొమురయ్య, ఉపాధ్యక్షులుగా బీ.మొగిలి, ఎం.కొమురయ్య, నగేష్ తదితరులు ఎన్నికయ్యారు.