SRPT: అనంతగిరి కొత్త గోల్ తండా గ్రామ సర్పంచ్ వేణు మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ వేణు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు.