TG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయనను మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన తుదిశ్వాస విడిచారు. శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది.