TG: తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు RTC JAC ప్రకటించింది. PRC అమలు గొప్ప ముందడుగు అని, ప్రధాన డిమాండ్లతో పాటు RTC సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకుగాను ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపింది. సమ్మె సమయంలో RTC కార్మికులపై పెట్టిన కేసులను కొట్టేయాలని ఈ సందర్భంగా కోరింది.