TG: HYD బుక్ ఫెయిర్ వ్యవస్థాపక సభ్యుడు గోపాలరావు(90) అనారోగ్యంతో కన్నుమూశారు. 1986లో బుక్ ఫెయిర్ సొసైటీ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ఆయన, తొలి ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించారు. రేపు RTC క్రాస్ రోడ్స్‌లోని నివాసంలో ఆయన పార్థివదేహాన్ని సందర్శనకు ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.