RR: మియాపూర్ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వల్లెపు వెంకటేష్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన బంగారం, వెండి, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుడైన ఇతనిపై గతంలో 45 కేసులు ఉన్నాయి. తాజా విచారణలో మియాపూర్, గచ్చిబౌలి పరిధిలోని 4 దొంగతనాలను ఒప్పుకున్నాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.