VZM: గడిగడ్డ రిజర్వాయర్ నీటి తరలింపు చర్యలు మానుకోవాలని YCP గుర్ల మండల అధ్యక్షుడు సన్యాసినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు కోరారు. ఆదివారం స్దానిక YCP కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. పట్టణ తాగునీటి కోసం తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలా చేస్తే 13 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయి భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు.