‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సాయిపల్లవి.. ప్రమోషన్లలో బిజీగా మారింది. తాజాగా, ముంబైలో జరిగిన కార్యక్రమంలో హీరో జునైద్ ఖాన్(ఆమిర్ ఖాన్ కుమారుడు), ఆమిర్ ఖాన్‌తో కలిసి ఆమె సందడి చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జపనీస్ చిత్రం ‘లవ్ లెటర్’ ఆధారంగా రూపొందిన ఈ మూవీ మే 1న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.