కోనసీమ: మండపేట పురపాలక వార్డుల సంఖ్య 30 నుంచి 36కు పెరగనుండగా తుది జాబితా సిద్ధమై రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. 2011 జనాభా ప్రాతిపదికన 49,180 ఓటర్లతో విభజన చేయగా ప్రతి వార్డులో 1,230 నుంచి 1,502 వరకు ఓటర్లు ఉంటారు. నోటిఫికేషన్ జారీ అనంతరం ప్రజల అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు స్వీకరించి మే నెలలో తుది వార్డుల జాబితా విడుదల చేయనున్నారు.