GDWL: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పౌర సరఫరాల శాఖ నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అనేక బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇంధనం కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరుతుండగా, నిల్వలున్న చోట గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.