RCB బౌలర్ సుయాష్ శర్మ IPL చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో అతడు 4 ఓవర్లు బౌలింగ్ చేసి.. కేవలం 7 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తాను వేసిన 24 బంతుల్లో 20 డాట్ బాల్స్ వేసి రికార్డు సృష్టించాడు. దీంతో IPLలో ఒక మ్యాచ్లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్గా, గతంలో CSK తరఫున దీపక్ చాహర్ (20) క్రియేట్ చేసిన రికార్డును సమం చేశాడు.