NRPT: మద్దూరు మండలానికి చెందిన తిరుమలప్ప తన కూతురు జ్యోతితో కలిసి బైక్ పైన పొలానికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరకు మోమినాపూర్ వాసి వెంకటేశ్‌పై ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.