NZB: ఇందూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లపై హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్లో, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉమ్మడి జిల్లా సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే ధన్పాల్ సమీక్షలో పాల్గొన్నారు.