తాను దర్శకురాలిగా మారాలని అనుకుంటున్నానని నటి ఫరియా అబ్దుల్లా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నాకు నటనతో పాటు దర్శకత్వంపై ఆసక్తి ఉంది. గతేడాది నుంచి నేను కొన్ని కథలను రాస్తున్నాను. అందులో ఏదొక కథను పూర్తిగా రెడీ చేసి త్వరలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నా’ అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.