MNCL: జన్నారం మండలంలోని గోదావరి తీర ప్రాంతం ఇరిగేషన్ ప్రాజెక్టులకు అనుకూలంగా మారింది. మండలంలోని కలమడుగు, బాదంపల్లి, చింతగూడ దండేపల్లి మండలంలోని ద్వారకా ప్రాంతాలలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించేందుకు అనుకూలంగా ఉంటుందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు గతంలో ప్రకటించారు. గోదావరిలో విస్తరంగా నీటి ప్రవాహం ఉండటం, ప్రాజెక్టులకు బలం చేకూర్చే బండ ప్రాంతం ఉంది.